MachilipatnamLocal News
October 17, 2026
విద్య - ఉపాధి

NMMS పరీక్ష తేదీ మార్పు.. దరఖాస్తు గడువు పొడిగింపు

  • October 13, 2026
  • 1 min read

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించే జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (NMMS) 2026–27 తేదీలో మార్పుతో పాటు దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి (డిఈఓ) యు.వి.సుబ్బారావు తెలిపారు.

పరీక్ష నూతన తేదీ & సమయం:

 * పరీక్ష నిర్వహించే తేదీ: 29-11-2026 (ఆదివారం) (గతంలో ప్రకటించిన 15-11-2026 స్థానంలో మార్పు చేశారు).

 * పరీక్ష సమయం: ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు.

ముఖ్యమైన గడువు తేదీలు:

 * హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ: 27-10-2026

 * పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 27-10-2026

 * ముద్రించిన నామినల్ రోల్స్, పత్రాలను డిఈఓ కార్యాలయానికి సమర్పించడానికి చివరి తేదీ: 28-10-2026

 * జిల్లా విద్యాశాఖాధికారి లాగిన్‌లో దరఖాస్తుల ఆమోదానికి చివరి తేదీ: 29-10-2026

పరీక్ష అర్హత ప్రమాణాలు, సిలబస్, పరీక్ష రుసుములో ఎటువంటి మార్పూ లేదని డిఈఓ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు.

అర్హులైన విద్యార్థులందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కోరారు.

About Author

SSN