MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

UPHC నారాయణపురంలో ఆశా డే సమావేశం: సర్వేలు, పరిశుభ్రతపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేంద్రనాథ్ పిలుపు

  • October 13, 2026
  • 1 min read
UPHC నారాయణపురంలో ఆశా డే సమావేశం: సర్వేలు, పరిశుభ్రతపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేంద్రనాథ్ పిలుపు

మచిలీపట్నం:

స్థానిక నారాయణపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో మంగళవారం ‘ఆశా డే’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేంద్రనాథ్ పాల్గొని, పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు మరియు వైద్య సేవలపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్‌లకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ విరేంద్రనాథ్ మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎమ్‌ల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ముఖ్యంగా నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) సర్వేను వేగవంతం చేసి, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ముందస్తుగానే గుర్తించి ఉచితంగా మందులు అందించాలని సూచించారు.

అలాగే, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, జ్వరం లక్షణాలు ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి తగిన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పాటించే ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ సూపర్‌వైజర్లు రాఘవేంద్రరావు, భట్రాజు సూరిబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్‌ఎమ్‌లు మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN