MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

తండ్రిని కోల్పోయిన చిన్నారికి రూ. 90 వేల ఆర్థిక భరోసా

  • October 12, 2026
  • 0 min read
తండ్రిని కోల్పోయిన చిన్నారికి రూ. 90 వేల ఆర్థిక భరోసా

స్వేచ్ఛ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రశంసించిన కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన తాళ్లపాలెం గ్రామానికి చెందిన పల్లేటి రాజు (20) కుటుంబాన్ని స్వేచ్ఛ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంది. మృతుడి చిన్నారి పల్లెటి వాత్సల్య భవిష్యత్తు కోసం పోస్టాఫీసులో రూ. 90,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఆర్థిక భద్రత కల్పించింది.

ట్రస్ట్ నిర్వాహకులు షేక్ రఫీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, పేదల ఆకలి తీర్చడం మరియు చిన్నారులకు విద్యాభరోసా కల్పించడం ఆదర్శప్రాయమని కలెక్టర్ కొనియాడారు.

సమాజంలో అవసరాల్లో ఉన్నవారికి చేతల్లో సహాయం అందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఫౌండర్ షేక్ రఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్విగ్న ఇన్ఫ్రా మురళీ మోహన్, కే. సుజాత, బోయిన నాగరాజు, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN