మచిలీపట్నంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి కరపత్రాల విడుదల!
మచిలీపట్నం:
స్థానిక గాంధీ బొమ్మ శివాలయంలో వేంచేసియున్న శ్రీ మహిషాసుర మర్ధిని సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికలు (పాంప్లెట్లు) గురువారం విడుదలయ్యాయి. అక్టోబరు 11, 2026 (ఆదివారం) నుండి అక్టోబరు 20, 2026 (మంగళవారం) వరకు అత్యంత వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు మరియు భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ యెండూరి సురేష్, ట్రెజరర్ చేబ్రోలు గాయత్రి, కమిటీ సభ్యులు బాలాజీ నారాయణ, ప్రధాన అర్చకులు చేబ్రోలు బాబీ, అర్చకులు సాయి మరియు భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ప్రత్యేక పూజలు, అలంకారాల వివరాలను ఈ కరపత్రాల ద్వారా భక్తులకు తెలియజేసినట్లు నిర్వహకులు వెల్లడించారు.

