MachilipatnamLocal News
October 17, 2026
విద్య - ఉపాధి

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

  • October 8, 2026
  • 1 min read

మచిలీపట్నం:

శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు సంవత్సరాల కాలవ్యవధి గల పారామెడికల్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

2026-27 అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి పారామెడికల్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ముఖ్య వివరాలు:
* మొత్తం సీట్లు: 50
* కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు
* వెబ్‌సైట్: కోర్సుల అర్హతలు, దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ కోసం www.apsahpc.co.in ని సందర్శించవచ్చు.
* దరఖాస్తు రుసుము: ₹100/-
* చివరి తేదీ: భర్తీ చేసిన దరఖాస్తులను రూ. 100/- రుసుము చెల్లించి 14-10-2026 సాయంత్రం 5:00 గంటల లోపు శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

About Author

SSN