MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళను సత్కరించిన సాంప్రదాయ మత్స్యకార సేవా సమితి నేతలు

  • October 6, 2026
  • 1 min read
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళను సత్కరించిన సాంప్రదాయ మత్స్యకార సేవా సమితి నేతలు

మచిలీపట్నం :

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APS RTC) చైర్మన్ కొనకళ్ళ నారాయణరావును ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి నాయకులు అభినందించారు.

మంగళవారం మచిలీపట్నంలోని కొనకళ్ళ నివాసంలో ఆయనను సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు, నాయకులు నాగిడి తాతారావు, కర్రి కృష్ణమూర్తి, ఎన్. అర్జునరావు తదితరులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — రాష్ట్రంలో మత్స్య వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్న ‘మత్స్యమిత్ర’ గ్రూపుల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఊరటను, ఆర్థిక వెసులుబాటును ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మారుమూల గ్రామాలకు సైతం వేళకు, సమర్థవంతంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్న ఘనత చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుకే దక్కుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీసీ విభాగం రాష్ట్ర నేత కొనకళ్ల జగన్నాథంతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

About Author

SSN