నందం రామారావు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ పారిశ్రామికవేత్త
మచిలీపట్నం :
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, కథా, నవలా రచయిత నందం రామారావు కుటుంబాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యుల్లతారెడ్డి దంపతులు మంగళవారం పరామర్శించారు. నందం రామారావు కుమార్తె నందం పద్మావతి ఇటీవల మృతి చెందడంతో, హౌసింగ్ బోర్డు కాలనీలోని వారి నివాసానికి విద్యుల్లతారెడ్డి దంపతులు వెళ్లారు.
ఈ సందర్భంగా నందం రామారావు, అయన కుమారుడు దూరదర్శన్ చీఫ్ కెమెరామెన్ నందం శ్రీనివాస్, అల్లుడు కుమ్మరిగుంట మధు, కుటుంబ సభ్యులను కలిసి పద్మావతి మృతికి సంతాపం తెలిపారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులకు కలిగిన విషాదాన్ని తెలుసుకుని, వారి బాధలో తాము కూడా భాగస్వాములమని పేర్కొంటూ ధైర్యం చెప్పారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
విద్యుల్లతారెడ్డి దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ వ్యాపారాలను నిర్వహిస్తూ పారిశ్రామిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె, నందం రామారావు కుటుంబాన్ని పరామర్శించి తన ఆత్మీయతను చాటుకున్నారు.

