MachilipatnamLocal News
May 1, 2026
మచిలీపట్నం

ఘనంగా నందం వసంత 5 వ వర్ధంతి

  • May 1, 2026
  • 0 min read
[addtoany]
ఘనంగా నందం వసంత 5 వ వర్ధంతి

మచిలీపట్నం :

సీనియర్ పాత్రికేయుడు, నవలా రచయిత నందం రామారావు ప్రధమ కుమార్తె నందం వసంత వర్ధంతిని శుక్రవారం ఆర్సిఎం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలందించిన నందం వసంత 2021 మే 1న కరోనా మహమ్మారి కారణంగా కన్నుమూశారు. ఆమె సేవలు, వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించి, అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వసంత జీవితం సేవా భావానికి నిదర్శనమని, ఆమె చూపిన మార్గంలోనే ముందుకు సాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు వసంతకు నివాళులర్పిస్తూ, ఆమె మానవతా విలువలను కొనియాడారు. సమాజానికి సేవ చేయడం ద్వారా ఆమె స్మృతిని నిలబెట్టుకోవడం గొప్ప విషయం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సాక్షి స్టాప్ రిపోర్టర్ అంబటి శేషుబాబు, రాజ్ న్యూస్ జిల్లా బ్యూరో కంచర్ల కృష్ణ ప్రసాద్, బి ఆర్ కె స్టాప్ రిపోర్టర్ లాజరు, వార్తా ప్రభ సబ్ ఎడిటర్ బత్తుల రామకృష్ణ, అమరావతి దినపత్రిక రిపోర్టర్ బట్ట శంకర్, ఇండియన్ పవర్ లీలా ప్రసాద్, సూర్య దినపత్రిక జిల్లా బ్యూరోలు జయకర్ బాబు, శ్రీహరి, స్కై లైన్ రిపోర్టర్ శ్యామ్, ఆంధ్రప్రభ సొంటి మురళి కృష్ణ, వక్కలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *