MachilipatnamLocal News
May 1, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

  • May 1, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

పేదల సేవలో కూటమి ప్రభుత్వం

పేదలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు అందిస్తున్నాం

రూ.30తో ప్రారంభమైన పెన్షన్ రూ.4000 చేసిన ఘనత చంద్రబాబుదే

మచిలీపట్నం :

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తో కలిసి పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. రూ.30తో పెన్షన్లు ప్రారంభించి నేడు ఏకంగా రూ.4000కి చేర్చిన ఘనత చంద్రబాబుదే. గతంలో రూ.3000 చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చి పేదలను దగా చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏప్రిల్ నుండే అమలు చేయడంతో పాటుగా.. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పెన్షన్లు అమలు చేస్తున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం కల్పిస్తుందని, అభివృద్ధికి అండగా నిలుస్తున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో మోటమర్రి బాబప్రసాద్ , 44వ డివిజన్ ఇంచార్జి మంచాల రాంబాబు , బచ్చుల బోస్ , గొర్రెపాటి గోపీచంద్ , ఇలియాస్ పాషా , బచ్చుల అనిల్ కుమార్ , లోగిశెట్టి స్వామి , కుంచె దుర్గా ప్రసాద్ , మారకాని సమతా కీర్తి , కరెడ్ల సుశీల , దేవరపల్లి అనిత తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *