MachilipatnamLocal News
May 1, 2026
జిల్లా

పామర్రు నియోజకవర్గంలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • May 1, 2026
  • 1 min read
[addtoany]
పామర్రు నియోజకవర్గంలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

పామర్రు:

పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మేడేను పురస్కరించుకుని కార్మికులు, యాజమాన్యాలకు ప్రభుత్వ పురస్కరాలను అందజేశారు. ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు శ్రమ శక్తి పురస్కారాలను అందించారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…. మీ ఉత్సాహం, సంతోషం చూస్తోంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రెండేళ్లకు మునుపు మనం ఎక్కడా ఈ విధంగా సరదాగా కూర్చునే పరిస్థితి, నవ్వే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి లేదు. ప్రజలందరికీ మరో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. నేను, పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి మోదీ ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మానం చేస్తామని చెప్పాం. ఆ మాట కోసం 22 నెలలుగా పని చేస్తున్నాం. ప్రతీ రోజు, ప్రతీ గంట లెక్కపెట్టుకుని తప్పు జరగకుండా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. 1వ తేదీ రాగానే గుర్తొచ్చేది పేదల సేవలో కార్యక్రమం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవా భావంతో మీ వద్దకు వచ్చి పింఛన్లు అందిస్తున్నారు. కష్టజీవులు…మేడే అనగానే గుర్తొచ్చేది కార్మికులు. ఎన్టీఆర్‌కు జన్మనిచ్చిన ప్రాంతం ఇది. టీడీపీ జెండాలో చక్రం, నాగలి గుర్తులు పెట్టారు…పేదల కోసం ఇల్లు గుర్తు కూడా పెట్టారు.

పసుపు శుభం… ఏ వ్యక్తి ఏ కార్యక్రమం చేయాలన్నా పసుపు లేకుండా కార్యక్రమం జరగదు. దూరదృష్టి కలిగిన నాయకుడు ఎన్టీఆర్. కార్మిక దినోత్సవం సందర్భంగా కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 62.47 లక్షల మందికి ప్రతీ నెలా పింఛన్లు అందిస్తున్నాం. రూ.63 వేల కోట్లకు పైగా పింఛన్లకు 22 నెలల్లో ఖర్చు చేశాం. ప్రతీ నెలా రూ.2,700 కోట్లు సిద్ధంగా ఉంచుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతోన్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని భారంగా ఆలోచించడం లేదు…బాధ్యతగా ఆలోచిస్తున్నా. పేదలకు ఈ కార్యక్రమం వెసులుబాటు కల్పిస్తుంది.

భర్త చనిపోయిన వారికి వెంటనే స్పౌజ్ పింఛన్లు అందిస్తున్నాం. లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా, అన్న క్యాంటీన్లో అన్నం పెట్టినా, గ్యాస్ ఇచ్చినా…అది పేదల కోసం. 263 అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు క్యాంటీన్లలో ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. మండుటెండల్లో పని చేస్తున్నారు…ప్రమాద పరిస్థితుల్లో పని చేస్తున్నారు..కార్మికులందరికీ నా సెల్యూట్ చేస్తున్నాను. మీ కష్టం వల్లే సమాజం ముందుకెళ్తోంది…అభివృద్ధి జరుగుతోంది. మన రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘిత కార్మికులు ఉన్నారు. చిన్న, పెద్ద పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వీరందరి కోసం రూ.615 కోట్లు కార్మిక సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం.

15 చోట్ల లేబర్ అడ్డాలు

రాష్ట్రంలో 15 చోట్ల లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం. వర్షం వచ్చినా, ఎండలు ఉన్నా ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నాం. లేబర్ అడ్డాకింద మంచి వసతులతో షెల్టర్ నిర్మిస్తున్నాం. అడ్డా నుంచి కార్మికులకు అవసరమైన వారికి పంపించవచ్చు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాణ్నే..నాకూ కష్టాలు తెలుసు. ఆధునీకరణలో ముందుకెళ్తున్నాం. కార్మికుడు కొడుకు ఎందుకు ఒక పరిశ్రమ స్థాపించకూడదు అన్న ఆలోచనా విధానంతో మార్పు తెచ్చుకుని నైపుణ్యం ఇచ్చి పనిముట్లు అందిస్తే రెట్టింపుగా పని చేయవచ్చు. లేబర్ అడ్డా స్కిల్ డెవలెప్మెంట్ కేంద్రంగా మారుతుంది.

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తీ ఇబ్బంది పడకూడదు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పనితీరును తెలుసుకుంటున్నా. ప్రజల తరపునే నేను ఉంటాను… ఎమ్మెల్యేల తరపున ఉండను. ప్రజలతోనే నాకు కమిట్మెంట్. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. కుమార్ రాజా అభినందిస్తున్నాను.

ఇటీవల నాకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డులో మంత్రులు, అధికారులకు కూడా భాగస్వామ్యం ఉంది. నేను టీం లీడర్‌ను మాత్రమే…టీం బాగా పని చేస్తే నాకు మంచి పేరు వస్తుంది. పోలవరం, అమరాతి నిర్మాణాలు, వ్యవసాయం అగ్రిటెక్, కారిడార్లు అభివృద్ధి జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతినిండా పని ఉంటోంది. మీలో నైపుణ్యం పెంచితే అదనంగా ఆదాయం వస్తుంది. 25 వేల మంది నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇస్తున్నాం… ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. కుటుంబ సభ్యలతో కలిపి 80 వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. లేబర్ అడ్డాను 15కు పెంచాలని ఆదేశించాం. రాష్ట్రంలో ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం. కార్మిక సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోశాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడికి వివాహ ఖర్చుకు రూ.25 వేలు ఇస్తున్నాం. కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేల ఆయనకు పిల్లలు పుడితే రూ.20 వేలు ఆయన భార్య, కూతురుకు సాయం అందిస్తాం. సాదారణ మరణాలకు రూ.60 వేలు ఇస్తాం. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇస్తాం. 4 కార్మిక కోర్టులు అందుబాటులో ఉన్నాయి.

అచ్యుతాపురం, గుంటూరు, శ్రీసిటీ, కర్నూలులో ఈఎస్ఐ ఆసుపత్రిలు కడతాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఒక ట్రెండ్ కాదు..తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, మత్య్సకారుల సేవలో, దీపం కింద ఉచిత గ్యాస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

పోలవరం పనులు శరవేగంగా

పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 13 ఏళ్లక్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా పంటలు వస్తున్నాయి. 2019 తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వమే వచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేది. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రాంవాల్ కొట్టుకుపోయింది. మళ్లీ పనులు వేగంగా చేస్తున్నాం పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. బందరు పోర్టుకు 2014లో భూసేకరణ చేశాం. 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం చేశారు. బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. 57 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ కు బందరు పోర్టు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నాం. విశాఖ తర్వాత అభివృద్ధి, ఆదాయంలో ముందుండే జిల్లా కృష్ణా జిల్లా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకుంది కృష్ణా జిల్లా అమ్మాయినే.

భారత్ మాలా పరియోజన కింద కేంద్రం రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ చేపడుతోంది. మచిలీపట్నం బై పాస్ రోడ్డు 2 లేన్ల నుంచి 6 లేన్లు చేస్తున్నారు. బీచ్ రోడ్డును విస్తరిస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నంకు 6 లేన్ల రోడ్డుగా విస్తరణ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ఎక్స్ ప్రెస్ హైవే వస్తోంది. అభివృద్ధి జరగాలంటే భూములు ఉండాలి. అమరావతి రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 29 వేల మంది 33 వేల ఎకరాలు అందించారు. రాజధాని రావడంతో వారి దశాదిశ మారింది. దేశంలోేనే అతిపెద్ద పెట్టుబడి గూగుల్ ది రూ.1.35 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ కూడా 17 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ముదుకొచ్చింది.

రాష్ట్రంలో ఉన్న కోడి కత్తి పార్టీది నేర ప్రవృత్తి. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. అతనికి మానసిక సమస్య ఉంది. అందర్నీ మోసం చేయడం…నాశనం చేయడం. అధికారంలోకి వచ్చాక తొలిరోజు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ప్రజావేదికను కూల్చారు. వేదిక కట్టడానికి రెండేళ్లు పడతుంది…కానీ గంటలో కూల్చవచ్చు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేశారు. అమరావతి ప్రజా రాజధానిని ఎడారి, స్మశానం అని నిర్మాణం ఆపేశారు. ఎన్డీఏ నిర్మాణం చేస్తుంటే… ఒక వ్యక్తి ఇంకా తన మాటలు చేతలతో విధ్వంసం చేస్తున్నారు. వివేకా నందరెడ్డి హత్యలో కూడా అనేక నాటకాలు ఆడారు. ఇది ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మేం అభివృద్ధి చేస్తే గొడ్డలి పార్టీ వచ్చి సర్వనాశనం చేసింది. ఇలాంటి పరిస్థితి ఇంక కొనసాగకూడదు అని కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *