MachilipatnamLocal News
April 29, 2026
జిల్లా

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

  • April 28, 2026
  • 0 min read
[addtoany]
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
మచిలీపట్నం:
 
వచ్చే మే నెల 1 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో డాక్టర్ ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడుతో కలిసి మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హేలీప్యాడ్ నిర్మాణం పనులను పరిశీలించారు. 
అప్రోచ్ రహదారి, బారికేడింగు, హెలిప్యాడ్ సజావుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం వారు సమీపంలో దాతల సహాయంతో నిర్మించిన ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు. 
 
 వారు భవనం మొత్తం కలియతిరిగి ఔట్ పేషెంట్ విభాగాలు కౌన్సిలింగ్, రోగనిరోధక గదులు, వివిధ రకాల వార్డులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకపోకలకు సంబంధించి బాధ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులకు సూచించారు.
 
ఈ పర్యటనలో కలెక్టర్ ఎస్పీ వెంట గుడివాడ ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్ డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్ సి పి డి సి ఎల్ ఎస్ ఇ రవీంద్రబాబు డి ఎల్ డి ఓ సునీత శర్మ తహసిల్దారులు లోకరాజు హరినాథ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కరుణకుమార్, కరస్పాండెంట్ రామకృష్ణ రిటైర్డ్ ప్రొఫెసర్ సురేంద్రబాబు గుడివాడ డిఎస్పి శ్రీనివాస్ నేత్ర వైద్యశాల సంస్థ డైరెక్టర్ కిరణ్ కుమార్ పరిపాలన అధికారులు స్వాములు పాపయ్య తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *