MachilipatnamLocal News
September 22, 2026
మచిలీపట్నం

వడ్డెరల సమస్యలను అంకిత కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన వేముల దుర్గారావు

  • June 10, 2026
  • 0 min read
వడ్డెరల సమస్యలను అంకిత కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన వేముల దుర్గారావు

మచిలీపట్నం:

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల అంశంపై సమకాలీన అనుభావిక అధ్యయనం నిర్వహిస్తున్న వన్ మ్యాన్ కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వేముల దుర్గారావు, సంఘ నాయకుడు శివరాత్రి నాగరాజు కమిషన్‌ను కలిసి వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. జిల్లాలో వడ్డెరలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నారని, స్థానిక సంస్థల్లో వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

వడ్డెర వర్గానికి చెందిన ప్రజలు విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి అవకాశాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి సముచిత రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేపడుతున్న అనుభావిక సర్వేలో వడ్డెరల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన సిఫార్సులు చేయాలని కమిషన్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ ప్రతినిధులు, నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు, సమస్యలను కమిషన్ సభ్యుడికి వివరించారు. కమిషన్ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.

About Author

SSN