MachilipatnamLocal News
September 22, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందిస్తాం – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు

  • June 8, 2026
  • 0 min read
ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందిస్తాం – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు

మచిలీపట్నం:

సామాన్య ప్రజలు వారి దయనందిన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను మీకోసం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేసే సమయంలో ఆ ఫిర్యాదు పరిష్కారానికి చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి వాటిని పరిష్కరించే దశగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు అన్నారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వారి సమస్యలను గూర్చి ఫిర్యాదు చేయడానికి రాగా వారి ఫిర్యాదులను అడిషనల్ ఎస్పీ ప్రత్యక్షంగా స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి, ఆ ఫిర్యాదు గురించి సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తెలియచేసి చట్టబరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మీకోసం కార్యక్రమానికి 42 ఫిర్యాదులు రాగా అందులో భూమి వివాదాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు ఉద్యోగ వ్యాపార మోసాలు ఇతరత్రా సమస్యలు గురించి ఫిర్యాదులు అందాయి.

About Author

SSN