45వ డివిజన్ లో శానిటేషన్ సిబ్బందికి బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి.ఎస్. కిరణ్ పాల్ వితరణ
మచిలీపట్నం:
సోమవారం 45వ డివిజన్ లో బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి ఎస్ కిరణ్ పాల్ శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలు, గ్లౌజులు, సబ్బులు, టవల్స్ అందజేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సిడింబి అగ్రహారంలో శానిటేషన్ సిబ్బంది తదితరులతో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ తదితరులు రోడ్లు ఊడ్చి, డ్రైనేజీ నందు పూడిక తీశారు. రోడ్డు మార్జిన్ ల ప్రక్కన పేరుకుపోయిన మట్టిని తొలగించారు.
ఈ సందర్భంగా బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ మాట్లాడుతూ మనం నిద్ర లేవకముందే వీధులను శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ చల్లుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ మరువలేనిదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు చేయడమే కాక, మృతుల అంత్యక్రియలు నిర్వహించిన మానవతా వాదులని కొనియాడారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్, డివిజన్ స్వచ్ఛ సైనికులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరసా మధుసూదనరావు, మురాల నాగేంద్రం, కొనకళ్ళ భాను ప్రసాద్, మాదివాడ వెంకట నరసింహారావు, డివిజన్ శానిటేషన్ సెక్రటరీ మానస, సచివాలయ సిబ్బంది,శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

