MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

జిల్లా కోర్టులో బాంబు కలకలం

  • March 23, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా కోర్టులో బాంబు కలకలం
మచిలీపట్నం :
      మచిలీపట్నం కృష్ణా జిల్లా కోర్టు లో బాంబు పెట్టినట్లుగా జిల్లా జడ్జి జి గోపి కి మెయిల్ రావడంతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా జడ్జి పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు రంగప్రవేశం చేశారు. 

        డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్  రెండు టీములుగా ఏర్పడి, జిల్లా కోర్టు సముదాయంలోని అన్ని కోర్టులు ఆణువణువూ జల్లెడ పట్టారు. ఎటువంటి బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే అన్ని కోర్టులను ఖాళీ చేయించి కక్షిదారులను పంపించి వేశారు. సోమవారం జరగవలసిన అన్ని కోర్టులోని కేసులను వాయిదా వేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *