MachilipatnamLocal News
March 11, 2026
ఫీచర్స్

వై జె ఆర్ డి ఎం ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా ప్రారంభమైన ‘సృజన-26’ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్

  • March 11, 2026
  • 1 min read
[addtoany]
వై జె ఆర్ డి ఎం ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా ప్రారంభమైన ‘సృజన-26’ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్
మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
        నగరంలోని వై జె ఆర్ డి ఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో “సృజన-26” టెక్నో కల్చరల్ ఈవెంట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
       రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫెస్టివల్‌లో మొదటి రోజు టెక్నికల్ ఈవెంట్స్, పేపర్ ప్రెజెంటేషన్స్, ప్రాజెక్ట్ ఇన్ఫో, కోడింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 100 అప్లికేషన్లు రాగా వాటిలో 20 కాలేజీలకు చెందిన వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
        ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకొళ్ల నారాయణరావు, కాలేజీ ప్రాజెక్ట్ ఎక్స్ పి ఆర్వో ప్రెసిడెంట్ పివి రావు , ఆర్‌కే సంస్థ అధినేత జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ డైరెక్టర్ – డాక్టర్ బి. పాండు రంగారావు హాజరై విద్యార్థులను అభినందించారు. అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా కొనసాగుతోంది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *