నేను చనిపోతే ఎవరూ కన్నీరు పెట్టొద్దు!
మరణం సహజం ….
నా జ్ఞాపకాలు…. నాతోనే సమాధి అవుతాయి.
నా చితిపై నా కిష్టమైన తెల్లని కాగితాలు,
పెన్నులూ పెట్టండి !!
రాసుకోవడానికి…..
లావెండర్, మల్లె సువాసనలతో
ఉన్న అత్తరులూ పెట్టండి ….
వాటి వాసనలు నాకిష్టం.
…….ఆ వాసనలు పీలుస్తూ……
నా కిష్టమైన పదాల కూర్పులో
రచనలు చేస్తూ ఉంటాను.
నా… అనే బంధాలు ఏమీ ఉండవు
కాల ప్రవాహంలో కరిగిపోతాను!
అందుకే ముందుగానే రాసుకుంటున్నాను!!
మరో జన్మంటూ ఉంటుందని అనుకోను!!!
ఇది నాది అనేది బతికున్నప్పుడే!
చివరి క్షణాల్లో…..
భార్య, పిల్లలు, ఆత్మీయులు, ఇంకా ఎందరో!!
కనురెప్పలు మూతపడక ముందే కదలాడుతుంటారు
ఆ తర్వాత అంతా శూన్యం …..
అందుకే అన్నారు ‘కన్ను తెరిస్తే జననం…..
కన్ను మూస్తే మరణమనీ.……’
నందం రామారావు
మచిలీపట్నం
మొబైల్ : 9393921025