జిల్లాలో 2024 నుండి ఇప్పటివరకు 150 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు . అందులో 10 మందికి తాజాగా సోమవారం నియామక పత్రాలు ఇచ్చామన్నారు. అందులో 7 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగులుగా, ఒకరు సంక్షేమ కార్యదర్శిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
అలాగే జిల్లాలో 132 మందికి పదోన్నతులు కూడా కల్పించామన్నారు. ఇంకా ఎవరికైనా ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంతో పాటు బకాయిలు కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులందరికీ జీతభత్యాల బ్యాంక్ ఖాతా తెరిపించి తద్వారా బీమా సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేశామన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఏదైనా ఉంటే వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నా మన్నారు.