MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి…. జిల్లా కలెక్టర్

  • January 30, 2026
  • 0 min read
[addtoany]
ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి…. జిల్లా కలెక్టర్
మచిలీపట్నం :
 
ఉద్యోగుల సమస్యలను వెంటనే పానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గుడివాడ ఉప ఖజానా కార్యాలయంలో సామాజిక మరుగుదొడ్లు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్ కు సూచించారు. 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ తెగల పిల్లలకు ఆధార్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారని, మండల విద్యాధికారులందరూ వారి పరిధిలో ఎంత మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు కావాలో వివరాలు సేకరించి అందజేయాలన్నారు. వారికి ఆధార కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని డిటిడబ్ల్యు ఫణి ధూర్జటికి సూచించారు. 
పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులు ఆలస్యం అవుతుందని బిల్లుల స్థితిగతులు కూడా తెలియడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించగా ఈ విషయమై జిల్లా కలెక్టర్ జిజిహెచ్ పర్యవేక్షకులు ఆశాలత నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, చాలా వరకు అర్హత లేని వారు దరఖాస్తు చేస్తున్నారని చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి మెడికల్ బిల్లుల చెల్లింపు పరిస్థితిపై సమీక్షించి త్వరితగతిన బిల్లులు చెల్లించే విధంగా పరిష్కార మార్గం చూపాలనీ సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ కు సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు బయోమెట్రిక్ హాజరు ఎక్కడైనా వేసుకునే అవకాశం కల్పించాలని కోరగా జిల్లా కలెక్టర్ అందుకు అంగీకరిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో పదవులు భర్తీ చేయాలని, అర్హులైన గ్రేడ్ 2 వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని, అర్హులైన గ్రేడ్ వన్ వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. వీఆర్ఏల జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని నిర్వహించిన విధులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు వీఆర్వోలు త్వరగా అందజేసి బిల్లులు క్లెయిమ్ చేయాలన్నారు. గాను పలు సందర్భాల్లో పాఠశాలలను సందర్శించినప్పుడు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు గణితంలో విద్యాబోధన అర్థమయ్యే రీతిలో చెప్పడం లేదన్నారు. కనీసం కూడికలు, తీసివేతలు, భాగాహారాలు కొంతమంది విద్యార్థులు సరిగా అర్థం కాక కొన్ని ఇబ్బందులతో చేయలేకపోతున్నట్లు ఇటీవల గమనించానన్నారు. లెక్కలు సరిగా చేయని ప్రతి విద్యార్థి దగ్గర కూర్చుని వారు ఎందుకు చేయలేకపోతున్నారు లోటుపాట్లను గమనించి వారి తప్పులను సరిదిద్ది సరైన మార్గం చూపేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి ,జిల్లా పరిషత్ డిప్యూటీ సీఎం ఆనందకుమార్, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, జిజిహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ ఆశాలత, జిల్లా ఖజానా అధికారి రవికుమార్ తదితర అధికారులు, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *