MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా యూనివర్సిటీ

ఓటు ను స్వేచ్ఛగా వినియోగించాలి – కృష్ణా యూనివర్సిటీ విసి ఆచార్య కె రాంజీ

  • January 23, 2026
  • 0 min read
[addtoany]
ఓటు ను స్వేచ్ఛగా వినియోగించాలి – కృష్ణా యూనివర్సిటీ విసి ఆచార్య కె రాంజీ
– విద్యార్ధుల ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ
 
మచిలీపట్నం:
 
        జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భముగా కృష్ణా విశ్వవిద్యాలయం లో విద్యార్ధులు ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ఒక ఆయుధం అని దానిని స్వేచ్ఛగా వినియోగించాలి అని పేర్కొన్నారు. కుల,మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా ఓటును వినియోగించుకుని దేశ పౌరులుగా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని విద్యార్ధులకు ఉద్బోధించారు. 
 
         రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు విద్యార్ధులతో ఓటర్లు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రాంబాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా. వీర బ్రహ్మచారి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. సల్మా, డా. శేషా రెడ్డి, డా. శాంతి కృపా, డా. రవి, విద్యార్ధులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *