MachilipatnamLocal News
April 3, 2026
కృష్ణా యూనివర్సిటీ

యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత అవగాహనా కార్యక్రమం

  • April 2, 2026
  • 0 min read
[addtoany]
యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత అవగాహనా కార్యక్రమం
మచిలీపట్నం : 
          కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్లాస్టిక్ వాడకం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
        ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య కె రాంజీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ క్యాంపస్ లోని 8 ఎన్ఎస్ఎస్ యూనిట్ల సహకారంతో అతి త్వరలోనే ఈ ప్రాంగణాన్ని స్వచ్ఛ విశ్వవిద్యాలయంగా తయారు చేస్తామని చెప్పారు.
      ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అప్నా భారత్ క్లీన్ వ్యవస్థాపకుడు గార్నెపూడి రాజేంద్ర మాట్లాడుతూ తాను అమెరికాలో ఉంటున్నా, తన పుట్టి పెరిగిన దేశానికి ఏదైనా చేయాలనే తపనతో ఈ సంస్థను స్థాపించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలియతిరుగుతూ ప్లాస్టిక్ రహిత భారతదేశానికై కలలు కంటున్నానని దీనిలో భాగంగా మున్ముందు కృష్ణా యూనివర్సిటీ కి కూడా తరచుగా వచ్చి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్తూ విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.
         ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పి. గోపి, ఆర్.దుర్గాప్రసాద్, ఎ.శేషారెడ్డి డి.శాంతికృప పాల్గొన్నారు.
 
షహీద్ దివస్ 
 
       ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా ఆర్ విజయ్ కుమారి మాట్లాడుతూ 1931 లో నిస్వార్ధంగా స్వాతంత్ర పోరాటంలో ప్రజల పక్షాన పోరాడుతున్న భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వంటి యోధులను బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశంగా ఉరి తీసిన వైనాన్ని నిరసిస్తూ ప్రతి సంవత్సరం భారతీయులందరూ అమరవీరుల దినోత్సవాన్ని ఒక సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్న విషయాన్ని విద్యార్థులకు విశదీకరించారు. ఆ ఘటన జరిగిన సమయానికి భగత్ సింగ్ కి కేవలం 23 ఏళ్లు మాత్రమేనని, అలాంటి త్యాగధానులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు.  
       ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా పి గోపి, ఆర్ దుర్గాప్రసాద్, కె కవిత, రంగ శ్రీ, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *