మచిలీపట్నం లో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం మచిలీపట్నం లక్ష్మణాపురానికి చెందిన పీటర్ మాత్యా (70) అనే వృద్ధుడు ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు.
మూడు స్తంభాల సెంటర్ నుండి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ సైకిల్ పై వెళ్తున్న వృద్ధుడు ను ఢీకొట్టడంతో అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.