ఘంటసాల:
పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఘంటసాలలోని శయన బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యమునకు గురైందన్నారు.
చరిత్ర తెలియని పాలకుడు జగన్మోహనరెడ్డి అన్నారు. విధ్వంశకునిగా జగన్మోహనరెడ్డి చరిత్రకు ఎక్కారని తెలిపారు. ఆయన హయాంలో పర్యాటక రంగం కూడా విధ్వంసమైందన్నారు. ఈ క్రమంలో అసంపూర్తిగా నిలిచిన శయన బుద్ధ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా పూర్తి చేయాలని బుద్ధప్రసాద్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.