[addtoany]
మచిలీపట్నం, 7మార్చి 2026, SSN:
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత ఘనంగా సన్మానించారు
తొలుత మహిళలకు టిడిపి తరఫున పసుపు కుంకుమ, తాంబూలం, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. మహిళా మణులు నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆది నుండి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంత్రి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కును కల్పించి మహిళలకు అండగా నిలిచింది అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు.మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. రాజకీయంలోకి కూడా రావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలే మహారాణులని ఆయన ఈ సందర్భంగా కీర్తించారు.
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చాటిన మహిళా మణులకు శనివారం సత్కారం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళను గౌరవించడం మన సంప్రదాయమని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు మహిళలకు స్థానిక సంస్థలలో 8 శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో హక్కు, పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను విద్య పరంగా డ్వాక్రా పథకం ప్రవేశపెట్టి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని, ఈ విధంగా మహిళా సాధికారతకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి మహిళల పట్ల కూటమి ప్రభుత్వంనకు ఉన్న నిబద్ధతను తెలియజేసిందన్నారు. అదేవిధంగా మహిళలు రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ సందర్బంగా డాక్టర్స్ విభాగం నుండి సాయి లలిత, సేవారంగం నుండి మరీదు మాధవి లత, కరెడ్ల సుశీల, విద్యా రంగం నుండి లింగమనేని స్రవంతి, కూచిపూడి నృత్యం నుండి కంచిపట్ల వెంకట జ్యోతి, పారిశ్రామిక రంగం నుండి జంపాన నాగ దుర్గ, నాటక రంగం నుండి నత్త కమల కుమారి, స్పోర్ట్స్ రంగం నుండి నగిడి గాయత్రి, విజయ కుమారి, కోలాటం నుండి పలపత్తి పద్మజ, అంగన్వాడీ టీచర్ గా రత్న శ్రీ, ఉత్తమ ఆయాగా నాగేంద్రమ్మ, ఆశ వర్కర్ గా కోటేశ్వరమ్మ, ఏఎన్ఎం గా సుంకర మంగమ్మ, డ్వాక్రా సంఘం నుండి సత్య శ్రీ, ఆర్టీసీ రంగం నుండి బోలెం విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయం నుండి కొనగల ఉమాలక్ష్మి, మున్సిపాలిటీ నుండి కడవకొల్లు అరుణశ్రీ, పోలీస్ రంగం నుండి కేసన బేబీ , అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో విశిష్ట సేవలు చేసిన ఏడు నియోజకవర్గాల నుండి లంకెశెట్టి నీరజ, వాలిశెట్టి హేమావతి, నూతి సుభాషిని, గుండేటి సుమతీరాణి, బత్తుల అని మేరీ లాజరస్, గుత్తికొండ పద్మావతి, మండవ బాల త్రిపుర సుందరి, విశ్వనాథపల్లి పాప, కోటేశ్వరమ్మ, దండమూడి లక్ష్మి, పండ్రాజు సుధారాణి, యార్లగడ్డ సుధారాణి, వేమూరి సుజాత, తుమ్మ కామేశ్వరి, రేవు నాగలక్ష్మి తదితరులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు( బుల్లయ్య ), జిల్లా ఉపాధ్యక్షులు మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, రాష్ట్ర తెలుగు మహిళ నాయకులు ముల్పూరి సాయి కళ్యాణి, జిల్లా నాయకులు యార్లగడ్డ సుచిత్ర, మైనేని ఇందిరా, పొదిలి లలిత, కొల్లి రమ్య, సాయి సుధా, సుంకర లక్ష్మి, కడవకల్లు కుమారి, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

