ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. యుగంధర్ ఆధ్వర్యంలో రైల్పేట మున్సిపల్ పాఠశాలలో వినికిడి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా నిర్వహణాధికారి డా. హిమబిందు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివారించదగిన బాల్య వినికిడి లోపం, చెవి లేదా వినికిడి సమస్యలు ఉన్న పిల్లలను ముందస్తుగా గుర్తించడం వలన చెవి సంరక్షణ గురించి, వినికిడి లోపాలకు గల కారణాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం చెవి సమస్యలు గల విద్యార్థులను పరీక్షించి, తగు చికిత్సను అందించారు.
అతి శబ్దాల వినడం వలన వినికిడి లోపం కలుగుతుందని ఆమె తెలిపారు. చెవులను శుభ్రం చేసేటప్పుడు ఏర్పర్ట్స్ మాత్రమే ఉపయోగించాలని ఇతరమైనవి ఉపయోగించడం వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చెవి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్లు డా. శ్రీ నిధి, డా. సాయి కిరణ్, డా. నిరీక్షణ, డా. అనూష, డా. శ్రీజ , ఆర్బీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.