రాష్ట్ర న్యాయస్థానం కన్నెర్ర చేసింది. జిల్లా కలెక్టర్ అల్టిమేటమ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు హుకుం జారీ చేశారు. రెవిన్యూ అధికారులు రూల్స్ చెప్పారు.
సామాన్య ప్రజలు నిజమేనేమో కల కాదు అనుకున్నారు. ఇంతకీ ఆ సమయం రానే వచ్చింది. రాజకీయ నాయకులు మేమున్నాంగా అని అభయమిచ్చారు.
గ్రామ గ్రామాన బరులు పెట్టారు. పందెం కోళ్లు కాళ్లకు కత్తులు కట్టారు. పందెం రాయుళ్ళు చేతిలో డబ్బుతో సిద్ధమయ్యారు. వందలు, వేలు కాదు…. లక్షలు, కోట్లతో. పందేలు ఎక్కువ గెలిచిన వారికి బహుమతులు… పగలు రాత్రి తేడా తెలియకుండా ఏర్పాట్లు… ఇలా చాలా… ఇంకా చాలా…
కన్నెర్ర చేసిన న్యాయస్థానం, అల్టిమేటమ్ ఇచ్చిన కలెక్టర్, హుకుం జారీ చేసిన పోలీస్ అధికారులు, రూల్స్ చెప్పిన రెవిన్యూ యంత్రాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగంలో పాలకుల అనధికార ఆజ్ఞలకు లోబడి చేష్టలుడిగి చూస్తున్నారు. పాలకులు పందెం బరులను సందర్శిస్తే వారికి రక్షణ కల్పిస్తున్నారు.
భారత రాజ్యాంగానికి లోబడి పాలన సాగిస్తున్న మన అధికార యంత్రాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు.