MachilipatnamLocal News
March 11, 2026
ఫీచర్స్

ఘనంగా సంస్కార్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే

  • March 9, 2026
  • 1 min read
[addtoany]
ఘనంగా సంస్కార్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే
మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN : 
      10వ డివిజన్ సుకర్లాబాదు లోని సంస్కార్ పాఠశాలలో సోమవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల కరస్పాండెంట్ క్రాంతి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  పాఠశాల కరస్పాండెంట్ చేతుల మీదుగా విద్యార్థులు సర్టిఫికెట్ ను అందుకున్నారు. 
         ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ఉపాధ్యాయురాలు రామ తులసి మాట్లాడుతూ సంస్కార్ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు వినూత్నంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలను, సంగీతమును, క్రీడలు, ఆటల లో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి తల్లిదండ్రులను ప్రత్యేకంగా దుశ్శాలువాలతో సన్మానించారు.
           విద్యార్థుల గ్రాడ్యుయేషన్ దుస్తులు పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సుమజ్యోతి, తల్లిదండ్రులు వాసా హేమలత, రామకృష్ణ, సునీత, మాధురి తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *