MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

సఖి వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

  • January 19, 2026
  • 0 min read
[addtoany]
సఖి వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం:


        సఖి వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ వద్ద సఖి వన్ స్టా ప్ సెంటర్ కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు.
            ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలు ఎదుర్కొనే హింస, వేధింపులు, వివక్ష వంటి సమస్యలకు తక్షణ సేవలు అందించడంలో సఖి వన్ స్టాప్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ వాహనం ద్వారా బాధితులకు తక్షణ చేరువ, కౌన్సిలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సహాయం వంటి సేవలను వేగవంతంగా అందించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
          ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, సఖి వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పి అర్చిష్మ, డిసిపిఓ. కిషోర్, చైల్డ్ లైన్ డిస్టిక్ కోఆర్డినేటర్ నాగరాజు, వన్ స్టాప్ సెంటర్ మరియు చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *