MachilipatnamLocal News
April 15, 2026
పోలీస్ & లీగల్ డైరీ

సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ -జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

  • April 5, 2026
  • 0 min read
[addtoany]
సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ -జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం :
 
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ నేటి తరాల వారికి ఆదర్శప్రాయుడని, సామాజిక న్యాయం కోసం నిస్వార్ధ పోరాటాలకు, అణగారిన వర్గాల వారి సమానత్వం కోసం కృషి చేసి, విద్యార్థి దశలోనే అంటరానితనం అనే సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్నతుడని, తన తండ్రి నుండి మానవతావాదం, ఆదర్శవాదం, స్థితిస్థాపకత అనే సద్గుణాలను అలవర్చుకొని,అణగారిన, వివక్షకు గురైన వారి న్యాయం కోసం అనేక పోరాటాలు, ప్రదర్శనలు చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
 ఆనాటి కాలంలోనే అంటరానితనం యొక్క పౌల్ ఆచారాన్ని నిర్మూలించేందుకు మహాత్మా గాంధీ తో కలిసి అనేక పోరాటాలలో తాను కూడా పాల్గొన్నారని, అంతేకాక స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో సైతం గాంధీ తో కలిసి తాను కూడా అడుగులు వేశారని, కనుక అటువంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడుని స్మరించు కోవడం మనందరికీ గర్వకారణం అని అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *