MachilipatnamLocal News
March 12, 2026
మచిలీపట్నం

రెవెన్యూ కార్యాలయంలో కోలాహలంగా మహిళా దినోత్సవ సంబరాలు

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
రెవెన్యూ కార్యాలయంలో కోలాహలంగా మహిళా దినోత్సవ సంబరాలు
 ముఖ్య అతిథిగా పాల్గొన్న నార్త్ తాసిల్దార్ నాగభూషణం
 
మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:
 
       ఆదివారం సెలవు దినం కావడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్ తహశీల్దార్, సౌత్ తాసిల్దార్ కార్యాలయాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మహిళలు, సిబ్బంది అందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
       నార్త్ డిప్యూటీ తహశీల్దార్ కనకదుర్గ మాట్లాడుతూ మహిళ శక్తికి నిదర్శనం అని అన్నారు. మహిళా ఉద్యోగులందరూ కలిసి ఇంత గొప్పగా వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు ఇలాంటి ఉల్లాసభరితమైన కార్యక్రమాలు మహిళల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయని ఆమె పేర్కొన్నారు.
       ​సౌత్ డిప్యూటీ తహశీల్దార్ కల్పన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు జారీ చేస్తూ, అదనపు క్యాజువల్ లీవ్స్ చైల్డ్లీ కేర్  సౌకర్యాలను కల్పించడం హర్షణీయం అన్నారు. భవిష్యత్తులో మహిళలకు మరిన్ని అవకాశాలు, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.
​      ఈ వేడుకల్లో మచిలీపట్నం తహశీల్దార్లు, మహిళ వి.ఆర్.ఏలు, రెవెన్యూ సిబ్బంది ఇతర కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *