రాష్ట్ర ఆర్.అండ్.బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డికి కృతజ్ఞతలు
అవనిగడ్డ:
నియోజకవర్గంలోని 16 ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధి మరమ్మత్తులకు రూ.6.45కోట్లు సాస్కి నిధులు మంజూరు అయినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
చల్లపల్లి నుంచి చిట్టూర్పు ప్రధాన రహదారి మరమ్మత్తులకు రూ.కోటి పది లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. చల్లపల్లి నుంచి నడకుదురు వెళ్లే ప్రధాన రహదారి 1400 మీటర్లు మరమ్మత్తులకు రూ.70లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు.
కోడూరు మండలంలోని విశ్వనాధపల్లి రోడ్డు మరమ్మత్తులకు రూ.30లక్షలు, సాలెంపాలెం రోడ్డు మరమ్మత్తులకు రూ.30లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. నాగాయలంక మండలం కమ్మనమోలు ప్రధాన రహదారి మరమ్మత్తులకు రూ.55లక్షలు, కమ్మనమోలు నుంచి సంగమేశ్వరం రోడ్డు మరమ్మత్తులకు రూ.40లక్షలు, ఘంటసాల మండలం యండకుదురు రోడ్డు మరమ్మత్తులకు రూ.55లక్షలు, అవనిగడ్డ మండలం కొత్తపేట – మాచవరం రోడ్డు మరమ్మత్తులకు రూ.40లక్షలు, కోడూరు మండలం ఉల్లిపాలెం రోడ్డు మరమ్మత్తులకు రూ.40లక్షలు, కోడూరు మండలం దింటిమెరక రోడ్డు మరమ్మత్తులకు రూ.35లక్షలు, అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం రోడ్డు మరమ్మత్తులకు రూ.30లక్షలు, నాగాయలంక – కోడూరు రోడ్డు నుంచి పోటుమీద వెళ్లే రోడ్డు మరమ్మత్తులకు రూ.20లక్షలు మంజూరు అయినట్లు వివరించారు. నాగాయలంక మండలం సొర్లగొంది-తలగడదీవి రోడ్డు మరమ్మత్తులకు రూ.30లక్షలు, మోపిదేవి మండలం నాగాయతిప్ప రోడ్డు మరమ్మత్తులకు రూ.10లక్షలు, ఘంటసాల మండలం చిట్టూర్పు జోడుగూడెం నుంచి ఘంటసాల వెళ్లే రోడ్డు మరమ్మత్తులకు రూ.15లక్షలు మంజూరు అయినట్లు వివరించారు. నాగాయలంక మండలం నంగేగడ్డ చోడవరం రోడ్డు మరమ్మత్తులకు రూ. 35లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివరించారు.
తమ నియోజకవర్గంలో ఆర్.అండ్.బీ రోడ్ల మరమ్మత్తులకు సాస్కి నిధులు మంజూరు చేసిన ఆర్.అండ్.బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.