MachilipatnamLocal News
March 17, 2026
జిల్లా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక…..మీకోసం అర్జీలు 109

  • March 16, 2026
  • 0 min read
[addtoany]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక…..మీకోసం అర్జీలు 109
మచిలీపట్నం:
 
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి ఎస్ డి సి పోతురాజు, డిఎస్పి శ్రీనివాసరావు లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక…..మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 
అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 109 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
 
మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన తిరుకోవల్లూరి మాధవి లత తన అర్జీ అందజేస్తూ కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీలో ఈడబ్ల్యూఎస్ లేఅవుట్ ఎల్ బ్లాక్ నందు 412 ఫ్లాట్ కు ఉత్తరాన ఉన్న ప్రభుత్వ స్థలమును బడుగు నాగరాజు అను వ్యక్తి ఆక్రమించారని ఆ ఆక్రమణలను తొలగించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
మచిలీపట్నం నగరం లక్ష్మణరావుపురం ఆర్టీసీ కాలనీకి చెందిన కోకా గోవిందరావు మాట్లాడుతూ తాను నేర్చు ఆదినారాయణ అనే వ్యక్తి నుండి 125 గలజాల ఖాళీ స్థలా న్ని కొనుగోలు చేసుకుని రిజిస్టర్ చేసుకుందామని వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని అమరయ్య అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారని తన స్థలాన్ని సర్వే చేయాలని మున్సిపల్ సర్వేయర్ కు చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా రావడంలేదని తాము సంవత్సరాల లోకి వెళితే రొయ్యల వ్యాన్లు అడ్డంపెట్టి వాళ్ళ మనుషులకు తమ మీద దాడి చేస్తున్నారని పోలీసుల సహకారంతో సర్వేయర్లలను పంపించి కొలతలు వేసి స్థలం అప్పగించవలసినదిగా వారు కోరుతున్నారు 
 
చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామ శివారు ఎన్టీఆర్ కాలనీ వాసులు నాగమల్లేశ్వరమ్మ తన అర్జీ అందజేస్తూ తాము కూలీ చేసుకుని జీవించే వారమని, 2000 సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వగా 60 కుటుంబాల వారు ఇల్లు వేసుకుని జీవించుచున్నామని, తమ కాలనీలో శ్రీ మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు నూతనంగా నిర్మించుకున్న డ్రయర్ నుండి దుమ్ము ధూళి వెలువడుతున్నాయని, దీని ఫలితంగా తమ ఇళ్లల్లోకి విపరీతమైన దమ్ము ధూళి వచ్చి తీవ్ర అసౌకర్యం అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. ఇప్పటికే తమ కాలనీలో దుమ్ము ధూళి మూలంగా ఒకరు చనిపోయారని, ఇంకా ముగ్గురు ఊపిరితిత్తుల శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పక్కనే ఉన్న మంచినీళ్ళ చెరువు కూడా కలుషితమవుతుందని రహదారులు చెట్లు ధూళితో నిండిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లుకు 50 గజాలలో అంగన్వాడీ కేంద్రం ఉందని పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, డ్రయర్ల ట్రాన్స్ఫార్మర్ స్థాయిని పెంచి ఏర్పాటు చేశారని ఆ కారణంగా 10 రోజులకు ఒకసారి ట్రాన్స్ఫార్మర్ పెద్దపెద్ద శబ్దాలతో పేలుతోందని, తమ ఇళ్లలో కరెంటు కూడా పోతూ ఉందని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని రైస్ మిల్లు డ్రయర్ ను, ట్రాన్స్ఫార్మర్ను తొలగించి తమ ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా కోరారు.
 
రైతన్న మీకోసం
 
రైతన్న మీకోసం రెండో విడత. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తూ రైతులకు ఐదు అంశాలపై అవగాహన కల్పించే దిశగా వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి డిఎస్ఓ మోహన్ బాబు పౌరసరఫరాల డిఎం శివరాం ప్రసాద్ పంచాయతీరాజ్ ఈ ఎస్ ఈ రమణ రావు ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్ ఎల్డీఎం రవీంద్రారెడ్డి బిసి కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్ డి డిపిఓ అరుణ జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *