[addtoany]
జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన పెన్షనర్లు
మచిలీపట్నం :
2025 మార్చి 25న ప్రవేశపెట్టిన ఆర్థిక సవరణ బిల్లులో భాగంగా పెన్షనర్స్ సవరణలు చేర్చి పార్లమెంట్లో ఆమోదించడం జరిగిందని, ఒకసారి బిల్లు పాస్ అయి రాష్ట్రపతి ఆమోద ముద్రపడితే అది చట్టంగా అవుతుందని, మార్చి 29 న గెజిట్ పబ్లికేషన్ చేసి జీవో గా ఇవ్వడం కూడా జరిగిందని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక కలెక్టరేట్ వద్ద పెన్షనర్స్ 9వ పిఆర్సి కమిషన్ రికమండేషన్లు అమలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం వారి చేతుల్లోకి తీసుకుంటూ దేశంలోని 70 లక్షల మంది పెన్షనర్ హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ ధోరణిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనదేశంలో ఓపిఎస్ పెన్షన్స్ పొందుతున్న, పొందబోయే వారందరికీ 25 మార్చి 1వ తేదీ దుర్దినం అని, ఆ బ్లాక్ డే రోజు పార్లమెంటులో వాలిడేషన్ యాక్ట్ ఆమోదించిన రోజుగా చీకటి దినంగా పరిగణించామని అన్నారు. ఆ చట్ట ప్రకారం ఒకటి ఒకటి 2026 ని పరిధిలోకి తీసుకొని పెన్షనర్లను విడదీసి రాబోయే జనవరి 2026 నుండి 9వ పిఆర్సి కమిషన్ రికమండేషన్లు అమలు చేయడమనేది వారి చేతుల్లోకి తీసుకుంటూ దేశంలోని 70 లక్షల మంది పెంచిన హక్కులను కాలరాసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లు అందరూ పే రివిజన్ సౌకర్యాన్ని పొందాలని భవిష్యత్తులో ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ సౌకర్యాలు పిఆర్సి సౌకర్యాలు అందరికీ పునరుద్ధరించేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెన్షనర్స్ హక్కులను కాలరాయడానికి నిరసనగా పెన్షనర్స్ సామూహిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చిందని, ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ వారి ఇచ్చిన పిలుపుమేరకు నేడు కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ యాక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను వర్గీకరించే అధికారం పొందిందని ప్రస్తుతం ఓ పి ఎస్ పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ జనవరి 2026 నుండి అమలు చేయబోతున్న ఎనిమిదవ సిపిసి నందు కమిషన్ ఇచ్చే రికమండేషన్ కు అనర్హులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓపిఎస్ పెన్షనర్లు అందరికీ పిఆర్సి ప్రయోజనాలు అందేలా చూడాలని, విభజించి పాలించడం, న్యాయం కాదని పే రివిజన్ సదుపాయం కోల్పోకుండా అందరికీ కల్పించాలని భవిష్యత్తులో ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ పెరుగుదల ఉండకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు నేడు కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ ఆశీర్వాదం వి ఆదినారాయణ వి కృష్ణారావు భాస్కరరావు పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు.

