బుధవారం మచిలీపట్నం బస్ స్టాండ్ వద్ద వీవీఎస్ గ్రాండ్ హోటల్ సమీపంలో ఒక వ్యక్తి ఆర్ 777, రాధే ఎక్స్చేంజ్ వంటి అనధికార యాప్ల ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు, చిలకలపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉడిమూడి చంటి సిబ్బంది, మధ్యవర్తులతో కలిసి వెళ్లి తనిఖీ నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న కేశవ కృష్ణ వ్యక్తిని పట్టుకుని విచారించి తన వద్ద నుండి నగదును సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.