కృష్ణాజిల్లాలో మిగిలిపోయిన 11 బార్లకు గురువారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 4, పెడన మున్సిపాలిటీలో 1, మచిలీపట్నం మండలం మంగినపూడి 1, గుడివాడ మున్సిపాలిటీలో 5, బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో గాని స్వయంగా గాని జిల్లా ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మచిలీపట్నం కార్యాలయంలో హైబ్రిడ్ మోడ్లో గాని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి అప్లికేషన్ తో పాటు 5 లక్షల రూపాయలు రుసుము, 10,000 వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటల వరకు, మరుసటి రోజు 5 న ఉదయం 8 గంటల్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ ప్రాంగణంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. లాటరీ బార్ లైసెన్స్ వచ్చినవారు వెంటనే 1/6 బై లైసెన్స్ ఫీజు కట్టవలెనని అన్నారు. బార్ల లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సిన వారు http//oc.hpfsproject.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి బారు కు కేటాయింపుగా కనీసం నాలుగు అప్లికేషన్స్ రావాలని లేని ఎడల ఆ షాపుకు సంబంధించి లాటరీ విధానంను రద్దు చేస్తామని అధికారులు తెలియజేశారు. లైసెన్స్ ఫీజులు ఇతర వివరాల కోసం జిల్లా ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఫోన్ నెంబర్ 996304239, అసిస్టెంట్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారి ఫోన్ నెంబర్ 8466981837 కు చేయవలసిందిగా తెలిపారు.