MachilipatnamLocal News
February 12, 2026
ఫీచర్స్

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని రంగోలి పోటీలు

  • January 25, 2026
  • 0 min read
[addtoany]
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని రంగోలి పోటీలు
మచిలీపట్నం:
 
        జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు ప్రాంగణంలో మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించారు 
         ఈ రంగోలి పోటీల్లో పలువురు మహిళలు పాల్గొనగా అందులో దాసరి నాగ మహాలక్ష్మి, తాత ఎన్విఎల్ స్వరూప ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపికయ్యారు. పాలమూరు సీత, బి ఎల్ నాగమణి సంయుక్తంగా తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి ఈనెల 25వ తేదీ ఆదివారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారు. 
         ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి. ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, తహసిల్దారు మధుసూదన్, పలువురు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *