MachilipatnamLocal News
February 12, 2026
పోలీస్ డైరీ

నకిలీ నోట్లపై కఠినంగా వ్యవహరిస్తాం…. జిల్లా ఎస్పీ

  • February 4, 2026
  • 0 min read
[addtoany]
నకిలీ నోట్లపై కఠినంగా వ్యవహరిస్తాం…. జిల్లా ఎస్పీ

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్.

 
మచిలీపట్నం :
 
కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దొంగ నోట్ల మార్పిడి ముఠా ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ మాట్లాడుతూ కృత్తివెన్ను మండలం సంఘముడి గ్రామంలో వైన్ షాప్ నందు ఫిబ్రవరి 2వ తేదీ ఇద్దరు వ్యక్తులు రెండు 500 రూపాయలు నకిలీ నోట్లు తీసుకువచ్చి మద్యం కొనుగోలు చేశారు అని, అనంతరం వైన్ షాప్ యజమాని నోట్లు పరిశీలించగా నకిలీ నోట్లను గుర్తించి వాటిపై కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.. నకిలీ నోట్ల ముఠా పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఉపయోగించి ముద్దాయిలను పట్టుకున్నామని ఎస్పీ వివరించారు.
 
ముద్దాయిల వివరాలను పెందుర్తి మండలం కోకావానిపాలెం గ్రామం కు చెందిన తోమండ్ర రంజిత్ సింగ్ బ్రహ్మ ఉమా శంకర్ , దిలీప్ ,పాశం రాజశేఖర్ అని తెలిపారు. ముద్దాయిలు గతంలో గంజాయి కేసు ,నాలుగు నకిలీ నోట్ల కేసులో నమోదయ్యాయి అని అన్నారు. ముద్దాయిలు కోకామని పాలెం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని నకిలీ నోట్ల ప్రింటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ముద్దాయి వద్ద నుండి 6,2,400 విలువ చేసే నకిలీ నోట్లను, 6000 రూపాయలు ఒరిజినల్ క్యాష్ ను, నకిలీ నోట్ల తయారు చేసే యంత్రాలను, మూడు సెల్ ఫోన్లు, హుండాయ్ శాంట్రో కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేసామన్నారు.
 
కృష్ణాజిల్లాలో ఎవరైనా అక్రమంగా నకిలీ నోట్లో ముద్ర వేసిన నకిలీ నోట్లో మార్చిన నకిలీ నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *