ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ప్రభుత్వ సెలవు దినం రోజున వచ్చినందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఈ ఈనెల 23 వ తేదీన శుక్రవారం నా ఇండియా నా ఓటు అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి సమాచారం వచ్చిందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.