మచిలీపట్నం ,:
ఎమ్మార్పీఎస్ పోరాటం లో తమ ప్రాణాలు త్యాగం చేసిన మాదిగ అమర వీరుల సంస్మరణ సంతాప కార్యక్రం స్థానిక మలకా పట్నం..జగజ్జీవన్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షరాలు డాకూరి శిరీష ఎం ఈ ఎఫ్.. నాయకులు బీడెల్లి మరియకుమార్ మట్టా జయప్రకాష్ తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించినారు . ఈ సందర్భంగా మరియకుమార్ మాట్లాడుతూ ఈ త్యాగ మూర్తుల త్యాగం వృధాకాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లో మందా కృష్ణా సమక్షం లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఈ త్యాగ శీలులను మాదిగ జాతి మరువదని అన్నారు శిరీష మాట్లాడుతూ త్యాగమూర్తులను కన్న తల్లులకు పాదాభి వందనాలు వారి త్యాగం మాదిగ జాతికి వరం అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి లలిత రాజు, చిలుమూరి కిషోర్, గండ్రపు శీనయ్య మాస్టర్,ఆనోక్ జూనపూడి గణేష్,ముదునూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.