మోపిదేవి:
సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవిలోని స్వయంభూ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు టేకు రథమును బహూకరించారు. ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ చేతుల మీదుగా స్వామివారికి ఈ రథాన్ని దాత అందించారు.
తొలుత నూతన టేకు రథ శిఖరానికి నారా రోహిత్, అవనిగడ్డ జనసేన యువ నేత మండలి వెంకట్రామ్, నిర్మాత అట్లూరి నారాయణ దంపతులచే బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమారశర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, దేవస్థానం ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ అభిషేకాలు జరిపించారు. అనంతరం అర్చకులు టేకు రథంపై నూతన శిఖర ప్రతిష్ట చేశారు.
ఈ సందర్భంగా దాత నారాయణ రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని స్వామి వారిని కోరుకున్నాని, కోరిక తీరడంతో నారా రోహిత్ చేతుల మీదుగా స్వామి వారికీ టేకు రథం సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ రథం నిర్మాణానికి సుమారుగా కోటి రూపాయలు ఖర్చు అయినట్లుగా నారాయణ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు, కూటమి నేతలు రావి నాగేశ్వరరావు, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, సనకా ప్రశాంత్, టీడీపీ జిల్లా నేత రావి రత్నగిరి, కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.