MachilipatnamLocal News
March 17, 2026
పోలీస్ & లీగల్ డైరీ

మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ

  • March 16, 2026
  • 1 min read
[addtoany]
మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ
మచిలీపట్నం :
 
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, వాటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, సోమవారం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ అన్నారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి, ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను బదిలీ చేసి పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారు.
 
  మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు:
 
 ఉన్న కొంత ఆస్తిని అమ్మి, వచ్చిన మొత్తంలో సొంత మామయ్యా తన వ్యక్తిగత అవసర నిమిత్తం 3,00,000/- కావాలని అడగడంతో, అయినవారే కదా అని ఇచ్చానని, ఇప్పుడు తిరిగి చెల్లించమంటే శారీరక దాడికి పాల్పడుతున్నారని కోడూరు నుండి కమలమ్మ అనే మహిళ ఫిర్యాదు.
 
 డిగ్రీ వరకు చదివి ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా ఉంటున్న సమయంలో, ఫోన్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి మిలటరీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి తన వద్ద నుండి 1,00,000/- రూపాయలు వసూలు చేశాడని, నెలలు గడుస్తున్న ఉద్యోగం గూర్చి కబురు లేకపోవడంతో ఉద్యోగం బుచ్చి అడగడంతో బెదిరింపులకు బాధపడుతున్నాడని న్యాయం చేయమని పెనమలూరు నుండి వెంకట్ అనే వ్యక్తి ఫిర్యాదు
 
వయసు మళ్లీన స్థితిలో కొడుకు, కోడలు అండగా ఉండి బాగోగులు చూసుకుంటారని అనుకుంటే, అత్యాశకు పోయి కోడలు ఆస్తిని తన పేర రాయాలని, లేకుంటే ఇంటి నుండి మెడ పట్టుకొని గెంటి వేస్తానని ఇబ్బంది పెట్టడమే కాక, కనీసం తినడానికి భోజనం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతుందని న్యాయం చేయమని మచిలీపట్నం నుండి సూరమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *