MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

మాజీ మంత్రి పేర్ని నాని పై ఫిర్యాదు

  • January 27, 2026
  • 0 min read
[addtoany]
మాజీ మంత్రి పేర్ని నాని పై ఫిర్యాదు
మచిలీపట్నం :
 
       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పేర్ని నాని వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను విఘాతం కలిగించడమే లక్ష్యంగా పేర్ని నాని వ్యాఖ్యలు ఉంటున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 
 
       అల్లర్లు జరిగితే దాన్ని సింపతీగా మలుచుకునే ప్రయత్నాల్లోనే భాగంగా పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని పై మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. 
 
         అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ జరగలేదని చెబుతున్న పేర్ని నానికి నిరూపించే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *