MachilipatnamLocal News
February 12, 2026
ఫీచర్స్

మహాశివరాత్రి పురస్కరించుకొని కరపత్రాలు విడుదల

  • February 4, 2026
  • 0 min read
[addtoany]
మహాశివరాత్రి పురస్కరించుకొని కరపత్రాలు విడుదల
మచిలీపట్నం :
 
స్థానిక చమనగిరిపేట లో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం లో బుధవారం రానున్న మహాశివరాత్రి పురస్కరించుకొని కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రెటరీ ఎండూరి. సురేష్ ఆలయ ట్రెజరర్ చేబ్రోలు నాగలక్ష్మి గాయత్రి ఆలయ ప్రధాన అర్చకులు చేబ్రోలు బాబి మహాశివరాత్రి రోజు కార్యక్రమాలు భక్తుల గోత్రనామములచే సాయంత్రం ఏడు గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవము తదుపరి రాత్రి 10 గంటల నుంచి భక్తుల గోత్రనామలచే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కి మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, అన్నాభిషేకము, విశేష హారతులు మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన భక్తులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకమును గాను 150 రూపాయలు అలాగే శాంతి కల్యాణ మహోత్సవం గాను 551 రూపాయి చెల్లించి తమ తమ గోత్రనామాలు నమోదు చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరడమైనది…( కళ్యాణం సామాగ్రి యావత్తు దేవాలయ కమిటీ ఏర్పాటు చేయుదురు.) పైన తెలిపిన కార్యక్రమాలన్నీ కూడా ఆలయ స్థానాచార్యులు జొన్నలగడ్డ వాసు శర్మ, వారి కుమారుడు జొన్నలగడ్డ సాయి శర్మ, తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *