ప్రారంభమైన మాస్టర్ సి వి వి గురుపూజా, మాస్టర్ ఇ కె శతజయంతి మహోత్సవాలు
లోకాకళ్యాణమే పరమావదిగా విశ్వ శ్రేయస్సుని కాంక్షిస్తూ 24 మంది రుత్వికుల నేత్రుత్వంలో పదకొండు హోమ గుండాలలో ఆదివారం ఉదయం ‘రుద్ర హోమా’లను నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవాసంస్థ ‘జగద్గురుపీఠం’ చైర్మన్ సి హెచ్ ఎస్ ఎన్ రాజు అన్నారు.
జగద్గురుపీఠం, మచిలీపట్నం శాఖ
ఆధ్వర్యంలో స్థానిక ఈడేపల్లి లోని వేడుక కళ్యాణ మండపంలో, మాస్టర్ ఇ కె బాలభాను విద్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న 42వ ‘మాస్టర్ సి వి వి గురుపూజా’, మాస్టర్ ఇ కె శతజయంతి మహోత్సవ’ములను శనివారం రాజు ప్రారంభించారు.
బెంగుళూరు జగద్గురుపీఠం నిర్వాహకులు రామ్ ప్రసాద్ జోషి ఆధ్యాత్మకి ప్రసంగంతో ప్రారంభమైన ఈ వేడుకలలో జగద్గురుపీఠం భౌగోళిక అధ్యక్షులు కె. సి ఎస్ గురుప్రసాద్, కార్యదర్శి బి ఆర్ కె రాజు, డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ చింతలపాటి సత్యదేవ్, జ్యోతిషాచార్య ఎన్. ఎస్ ఎస్. రామ్,విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, బెంగుళూర్ తదితర కేంద్రాలనుండి జగద్గురుపీఠం ప్రతినిధులు, యోగసాదకులు పాల్గొన్నారు.