స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2026-27 విద్యా సంవత్స రానికి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఏప్రిల్ రెండో తేదీతో ముగుస్తుందని విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు https:// machilipatnam. kvs.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడా నికి https:// admission.kvs.gov.in లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.
ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరు ఏళ్లు ఉండాలని అన్ని తరగతులకు సంబం ధించి వయస్సు నిర్ధారణను 31 మార్చి 2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. సీట్ల రిజర్వేషన్ అనేది కేవీఎస్ ప్రవేశ మార్గదర్శకాలు 2026-27 ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకో వాలని ఆయన సూచించారు.