MachilipatnamLocal News
March 30, 2026
మచిలీపట్నం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

  • March 29, 2026
  • 0 min read
[addtoany]
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
 మచిలీపట్నం:
 
       మచిలీపట్నం ఆర్.కె.మెస్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం కృష్ణాజిల్లా భదిర సంయుక్త సంఘం ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భధిర ఫౌండేషన్ ప్రత్యేక శిక్షణ మాజీ సభ్యురాలు టి. ఆర్. వి. సత్యవాణి (విజయవాడ) ముఖ్యఅతిథిగా హాజరై బధిరులకు  సాంకేతిక రూపంలో(సైన్ లాంగ్వేజి) తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ ఇంచార్జి జనసేన పార్టీ బండి రామకృష్ణ, కృష్ణాజిల్లా దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు వి. కామరాజు, రాష్ట్ర భధిర సంయుక్త సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి. రాజ్యలక్ష్మి పాల్గొని స్త్రీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు ఎన్ శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ బి నాగబాబు పర్యవేక్షించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *