భారత ప్రభుత్వం విద్యార్శలలో సృజనాత్మక మరియు ఉత్తమ శాస్త్రీయ ఆలోచలకు అందించే ఇన్ స్పయర్ సైన్స్ ప్రాజెక్టులో రామానగరంలోని చల్లపల్లి పబ్లిక్ స్కూల్ కు చెందిన పరుచూరి అభయ్ ప్రతిభ చూపి ఇన్ స్పయిర్ అవార్డు అందుకున్నట్లు సిపిఎస్ ప్రిన్సిపాల్ శ్యామ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్యామ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్ స్పయిర్ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా చల్లపల్లి పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఘంటసాల మండలం ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ పరుచూరి రవి కుమారుడు అభయ్ ప్రతిభ చూపించి రూ. 10వేలు నగదు అందుకోవడంతో పాటు ఇన్ స్పయిర్ అవార్డు అందుకున్నట్లు తెలిపారు.
ప్రతిభ చూపిన విద్యార్థి అభయ్ ను స్కూల్ డైరెక్టర్ ఎస్.వీరేష్ కుమార్, ప్రిన్సిపాల్ శ్యామ్ ప్రతాప్ సింగ్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.