కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థానిక పట్టాభి భవనం నందు అసెంబ్లీ కోఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ రాట్నం ఉన్న పార్టీ పతాకాన్ని ఎగురవేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని రక్షించడం కోసం స్వేచ్చా వాయువుల కోసం నడుం బిగించి ప్రాణ త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర ఈ దేశంలో కాంగ్రెస్ కు మాత్రమే ఉందని అన్నారు.
స్వాతంత్రమే లక్ష్యంగా సత్యం అహింస ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ సాగించిన పోరు భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాలలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అని అన్నారు, అంత ఘన చరిత్ర ఉన్న త్యాగధనుల కాంగ్రెస్ పార్టీని నేటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నోటికి వచ్చినట్లు గాంధీ గారిని నెహ్రూ గారిని గాంధీ కుటుంబాన్ని మాట్లాడడం పిరికి పందల చర్య అని అన్నారు,
అంతేకాక 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం గ్రామీణ పేద ప్రజల కోసం సంవత్సరానికి కనీసం వంద రోజులు పని దినాలు కల్పించాలని బృహత్తర కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అమలు చేస్తే నేటి మోడీ ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడి నిధులను కోసి నిధులు లేని కొత్త పథకాన్ని తేవటం సాక్షాత్తు జాతిపితను అవమానించడమే అని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అబ్దుల్ మతీన్, పిసిసి డెలిగేట్ కోకా ఫణి భూషణ్, నల్లబోలు కుమారి, చిలుకోటి ప్రసాద్, షేక్ అయ్యుబ్, సామ్యూల్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.