శివాజీ మాటలు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయి….. త్రిముఖ హీరోయిన్ దాసరి సాహితి
మచిలీపట్నం :
ఇటీవల హీరోయిన్ లు వస్త్రాదరణ పై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై త్రిముఖ సినిమా హీరోయిన్ సాహితీ దాసరి మండిపడ్డారు. నటుడు శివాజీ మాటలతో ఆమె విభేదించారు. సాహితి దాసరి త్రీముఖ సినిమా రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మచిలీపట్నం వరం సెంట్రల్ మాల్ కు చిత్ర యూనిట్ వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో హీరోయిన్ సాహితి దాసరి మాట్లాడుతూ నటుడు శివాజీ మహిళలపై మాట్లాడిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో మహిళలకు పూర్తిగా అవగాహన ఉందని దీనిపై శివాజీ ప్రత్యేకంగా ఎవర్ని ఉద్దేశించి మాట్లాడిన అవసరం లేదని ఆమె అన్నారు. ఒకరు బాగున్నారు అని చెప్పడానికి ఇంకొకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మహిళలు ఇలాగే ఉండాలని నిర్ణయించడానికి ఆయనకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం స్వేచ్ఛకు చిహ్నం అని అన్నారు. శివాజీ మాటలు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అన్నారు. సినీ రంగంలో వస్త్రధారణ కు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. సినిమా నటన లో వివిధ రకాల వస్త్రాలతో ప్రేక్షకులను అలరించాల్సి వస్తుందని దానిపై నెగిటివ్ కామెంట్స్ తో శివాజీ మాట్లాడారని అన్నారు. ఆయన మాటలతో హీరోయిన్ సాహితీ విభేదించారు. శివాజీ, అనసూయ కు జరుగుతున్న మాటల యుద్ధంలో హీరోయిన్ సాహితి అనసూయ కి మద్దతు ఇచ్చారు. ఈ హీరోయిన్ గతంలో అనేక సినిమాలలో కీలక పాత్రను పోషించింది. పోలిమేర 1, పొలిమేర 2 తన నటనతో సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారని త్రిముఖ సినిమాలో మరింతగా హీరోయిన్ సాహితి పాత్ర ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఆమె అన్నారు.