బందరులో ప్రతి వీధిలో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తాం
మచిలీపట్నం:
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం 20వ డివిజన్ గిలకలదిండిలో డ్రైనేజ్, మంచి నీటి పైపులైన్, గ్రామీణ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్య కాలంలో కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాం. తర్వాత వచ్చిన పాలకులు నాశనం చేశారని ధ్వజమెత్తారు. గిలకలదిండి ప్రాంత ప్రజలకు తాగు నీరు పంపిణీ చేయడం కోసం వాటర్ ట్యాంకు నిర్మిస్తే.. దాన్ని కూడా నాశనం చేశారు. తాజాగా రూ.30లక్షల వ్యయంతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో డ్రైనేజ్ పనుల కోసం ఇప్పటికే రూ.12 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.70 కోట్ల వ్యయంతో మరిన్ని అభివృద్ధి పనులు చేయబోతున్నాం. అవసరమైన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గానికి నూతన శోభ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు , డీసీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ , మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ , లంకె నారాయణ ప్రసాద్ , కొక్కిలిగడ్డ నాగ రమేష్, గిలకలదిండి ఇంచార్జి రమేష్, టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, టౌన్ పార్టీ మాజీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, బచ్చుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.